Syria: సిరియాలో మళ్లీ అలజడి.. నగరాల్లో కాల్పుల ఘటనలు 1 y ago
సిరియాలో మళ్లీ అలజడి రేగింది.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారులు, సిరియా భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అసద్ మద్దతుదారులు అత్యధికంగా ఉండే లటాకియా, టార్టస్, జాబ్లే నగరాల్లో కాల్పుల ఘటనలు జరిగాయి. గురువారం సిరియాలోని జాబ్లే పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ప్రభుత్వ భద్రతా సిబ్బందిపై అసద్ మద్దతుదారులు దాడులు చేయడంతో ఈ ఘర్షణలు మొదలయ్యాయి.